తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్!

  • 24 గంటల్లో 551 కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,195
  • కోలుకున్న వారు 2,71,649 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,506
తెలంగాణలో గత 24 గంటల్లో 551 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 682 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,195 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,71,649 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,506కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,040 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,955 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 63,54,388 కరోనా పరీక్షలు నిర్వహించారు.


Corona Virus
COVID19
Telangana

More Telugu News